చిన్నారిని ఆదుకుంటాం – ఎమ్మెల్యే ప్రశాంతమ్మ
– చిన్నారిని చిత్రహింసలు పెట్టిన వారిపై చట్టపర చర్యలకు ఆదేశం.
– విపిఆర్ ఫౌండేషన్ ద్వారా బాధిత బాలికను ఆదుకుంటాం.
ఇందుకూరుపేట మండలంలో కుడితిపాలెం గ్రామం కాకర్లదిబ్బలో చిత్రహింసలకు గురైన చెంచమ్మ అనే బాలికను విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఆదుకుంటామని కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు అన్నారు. మంగళవారం నెల్లూరులోని అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న చిన్నారిని ఆమె పరామర్శించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు మాట్లాడుతూ చిన్నారి చెంచమ్మను దారుణంగా హింసించడం అమానుషమన్నారు. చెంచమ్మను చిత్రహింసలకు గురి చేసిన వారిపై చట్టపర చర్యలు తీసుకోవాలని డిఎస్పీని కోరామన్నారు. నిందితులను ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదని స్పష్టం చేశారు.
చికిత్స పొందుతున్న చిన్నారి కోలుకున్నాక ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా పాఠశాలలో చేర్పించి బాగోగులు చూస్తామన్నారు.
ఇందుకూరుపేట మండల టిడిపి అధ్యక్షులు ఏకొల్లు పవన్ కుమార్ రెడ్డి, టిడిపి నాయకులు కోడూరు కమలాకర్ రెడ్డి, బెజవాడ సుధాకర్ రెడ్డి, కూకటి వెంకటేశ్వర్లు రెడ్డి, తిక్కవరపు సుధాకర్ రెడ్డి, బొద్దుకూరు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.