
*తేదీ 29.10.2025*
*చిత్తు కాగితాలు,,చిక్కు వెంట్రుకలు అమ్ముకొని జీవనం సాగించే కుటుంబాల ఇంటికే పరిమితమ ఉన్నారు వారి పిల్లలకు స్నాక్స్ తినుబండారాలు అందజేయడం జరిగింది*
*కొత్తూరు సిపిఎం శాఖ ఆధ్వర్యంలో మోంత తుఫాను ప్రభావంతో నెల్లూరు రూరల్ 30 వ డివిజన్ వైయస్సార్ నగర్ మల్లయ్య గుంట ప్రాంతాలలో చిత్తు కాగితాలు, చిక్కు వెంట్రుకలు అమ్ముకొని జీవనం సాగించే కుటుంబాలు ఇంటికే పరిమితమై ఉన్నారు వారి పిల్లలకు స్నాక్స్ తినుబండారాలు అందజేయడం జరిగింది
*ఈ సందర్భంగా శాఖ కార్యదర్శి కండె కోటేశ్వరరావు మాట్లాడుతూ తుఫాను ప్రభావిత ప్రాంతమైన వైయస్సార్ నగర్ మల్లయ్యగుంట ఏరియాలలో పేదలు వర్షాల కారణంగా ఇండ్లలోకి నీరు చేరడం వల్ల పనులు లేక ఇంటికి పరిమితమై ఉన్నారు ప్రభుత్వం వెంటనే వీరికి నిత్యవసర సరుకులు ఆహారం అందజేయాలని కోరినారు*
*ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు వాసుదేవరావు, ప్రకాష్ రావు ,మధు, సీనయ్య, రాజేశ్వరమ్మ, వెంకటేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు*