*పత్రికా ప్రకటన (15.12.2025)*

*SPS నెల్లూరు జిల్లా*

*చట్ట ప్రకారం విచారణ జరిపి న్యాయం చేస్తాం.. నెల్లూరు జిల్లా యస్.పి. డా. అజిత వేజెండ్ల,ఐపియస్.,.*

*ఈ రోజు జిల్లా పోలీసు కార్యాలయం నందు నిర్వహించిన ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమంలో 114 ఫిర్యాదులు స్వీకరణ.*

• *వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, సంబంధిత పోలీసు అధికారులతో స్వయంగా ఫిర్యాదుదారులను మాట్లాడించి, వారికి తక్షణమే ఉపశమనం కలిగించే విధంగా తగిన చర్యలు తీసుకున్న జిల్లా యస్.పి. గారు.*
• *ప్రజా ఫిర్యాదుల పట్ల అలసత్వం ఉండరాదు.. ప్రజలతో జవాబుదారీగా వ్యవహరించి పిటీషన్లను పరిష్కరించాలని ఆదేశాలు.*
• *’ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన ఫిర్యాదులపై త్వరితగతిన స్పందించి, చట్టపరిధిలో పరిష్కారం చూపాలని పోలీసు అధికారులను ఆదేశించిన జిల్లా యస్.పి. గారు.*
• *జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యల వినతులను స్వీకరించి ఫిర్యాదిదారులతో జిల్లా యస్.పి. గారు స్వయంగా మాట్లాడి వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు.*

*ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి మొత్తం 114 ఫిర్యాదులు వచ్చాయి.*

*వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని..*

1. ఆత్మకూరు పరిధికి చెందిన వ్యక్తికి, వాట్స్ యాప్ ద్వారా పరిచయమై, ఆన్ లైన్ లో బిట్ కాయిన్ ట్రేడింగ్ లో ఇవేస్ట్ చేయడం ద్వారా అధిక నగదు సంపాదించవచ్చని ఆశ చూపి, 11,65,771/- పెట్టుబడి పెట్టించి, నగదు తిరిగి ఇవ్వకుండా మోసం చేశారని, మోసపోయానని, విచారించి న్యాయం చేయాలని కోరారు.
2. ఇందుకూరుపేట పరిధికి చెందిన మహిళ, తన ఇద్దరు కుమారులకు ఆస్తి పంపకాలన్నీ సమానంగా చేసినట్లు, తమ నివాసం కొరకు చిన్న ఇంట్లో ఉంటున్నట్లు, తన పెద్ద కుమారుడు కోడలు ఆ ఇంటిని కూడా ఇవ్వాలని ఇంటి నుండి వెళ్లిపోవాలని తనని, తన భర్తను బెదిరిస్తూ మానసికంగా వేధిస్తున్నారని విచారించి న్యాయం చేయాలని కోరారు.
3. రాపూరు పరిధికి చెందినటువంటి మహిళ యొక్క కుమార్తెకు పెళ్లి చేసినట్లు, గత మూడు నెలల నుండి భర్తతో వివాదాల కారణంతో పుట్టింట్లో ఉన్నట్లు, ఒకటిన్నర నెల క్రితం తన భర్త బాధలు బరించలేక ఇంటి నుండి ఎక్కడికో వెళ్లిపోయిందని ఆచూకీ కనుగొని అప్పగించాలని కోరారు.
4. కలువాయి పరిధికి చెందినటువంటి వ్యక్తిని, అదే ప్రాంతానికి చెందిన కండె ప్రసాద్ మరి కొంత మంది కలిసి తన పొలం విషయంలో కొట్టి, వేధించినట్లు, గతంలో కేసు నమోదు చేసి ఉన్నట్లు, అయినప్పటికీ తన పొలం సాగుచేసుకోనీకుండా ఇబ్బంది పెడుతున్నారని, విచారించి న్యాయం చేయాలని కోరారు.
5. వెంకటాచల సత్రం పరిధికి చెందినటువంటి మహిళను, తన భర్త అత్తమామలు అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని, అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని, తన జీవనాధారం కూడా కష్టంగా ఉందని అదేవిధంగా బిట్రగుంట పరిధికి చెందిన మహిళ యొక్క భర్త మరణాంతరం తన అత్త ఆడపడుచులు కొట్టి ఇంటి నుండి తరిమివేశారని, తనకు ముగ్గురు ఆడపిల్లలని, జీవనాధారం కూడా కష్టంగా ఉందని, విచారించి న్యాయం చేయాలని కోరారు.

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి, బాధితులకు న్యాయం చేస్తామని, సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని ఈ సంధర్భంగా జిల్లా యస్.పి. డా. అజిత వేజెండ్ల,ఐపియస్ గారు హామీ ఇచ్చారు.

 ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా యస్.పి. గారు, SB DSP శ్రీ శ్రీనివాసరావు గారు, లీగల్ అడ్వైజర్ శ్రీ శ్రీనివాసులు రెడ్డి గారు, DCRB CI శ్రీ రామారావు, మహిళా స్టేషన్ CI శ్రీ సుబ్బారావు, వెల్ఫేర్ RI శ్రీ రాజారావు గార్లు మరియు కంప్లైంట్ సెల్ సిబ్బంది పాల్గొన్నారు.

జిల్లా పోలీసు కార్యాలయం, SPS నెల్లూరు జిల్లా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *