
*క్రమం తప్పకుండా అన్ని ప్రధాన కాలువలతో పాటు చిన్నపాటి డ్రైన్ కాలువలలో పూడికతీత పనులను చేపట్టి, రోడ్లపై సిల్ట్ లేకుండా ఎప్పటికప్పుడు తొలగించి వేయాలని సిబ్బందిని ఆదేశించిన కమిషనర్*
నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ పారిశుద్ధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా గురువారం స్థానిక గ్రాండ్ ట్రంకు రోడ్డు మినర్వా గ్రాండ్ హోటల్ పరిసర ప్రాంతాలలో జరుగుతున్న డ్రైన్ కాలువల పూడికతీత పనులను అధికారులతో కలిసి పర్యవేక్షించారు.
స్థానిక ప్రాంతాలలో క్రమం తప్పకుండా అన్ని ప్రధాన కాలువలతో పాటు చిన్నపాటి డ్రైన్ కాలువలలో పూడికతీత పనులను చేపట్టి, రోడ్లపై సిల్ట్ లేకుండా ఎప్పటికప్పుడు తొలగించి వేయాలని సిబ్బందిని కమిషనర్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ శానిటేషన్ విభాగం అధికారులు, వార్డు సచివాలయ శానిటేషన్ కార్యదర్శులు, సిబ్బందికి పాల్గొన్నారు.