*కొత్త సంవత్సరం ప్రతి ఒక్కరికీ.. సరికొత్త వెలుగులు నింపాలి – ఎంపీ వేమిరెడ్డి*
నూతన సంవత్సరం 2025… ప్రతి ఒక్కరి జీవితంలో సరికొత్త వెలుగులు నింపాలని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి గారు ఆకాంక్షించారు. బుధవారం న్యూ ఇయర్ సందర్భంగా జిల్లా వాసులకు ఆయన 2025- ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. గతేడాది చేదు జ్ఞాపకాలు తొలగిపోయి 2025 సంవత్సరం.. కొత్త ఆనందాన్ని, కొత్త లక్ష్యాలను, కొత్త విజయాలను అందించాలని కోరారు. ఏడాదిలో భగవంతుడు నిండు ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించారు. గడిచిపోయిన రోజు గురించి చింతించకుండా.. కొత్త అవకాశాలను అందిపుచ్చుకుని ముందుకు సాగాలని ఆయన చెప్పారు. సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌గారి సారథ్యంలో కూటమి ప్రభుత్వం ఈ ఏడాది ప్రజలకు మరింత మంచిని చేకూరుస్తుందన్నారు. బంగారు భవిష్యత్తును కాంక్షిస్తూ కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని వివరించారు. కొత్త ఆకాంక్షలతో కూడిన జీవితం మరింత ఆకర్షణీయంగా ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి నేపథ్యంలో జనవరి 1న సంతాప దినం అయిన కారణంగా ఎలాంటి వేడుకలు నిర్వహించడం లేదు. కావున ప్రతి ఒక్కరూ గమనించి సహకరించగలరు.