*SPS నెల్లూరు జిల్లా:*
*తేది:25-03-2025

 

*కూటమి ప్రభుత్వం అక్రమంగా కేసులు బనాయించినా, ధైర్యంగా ఎదుర్కొంటాం తప్ప, కేసులకు బెదిరే ప్రసక్తే లేదు” – కాకాణి*

 

*నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ముత్తుకూరు మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమైన మాజీ మంత్రివర్యులు మరియు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డా౹౹ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.*

*స్క్రోలింగ్ పాయింట్స్:*

👉 కూటమి ప్రభుత్వం అక్రమంగా కేసులు బనాయించినా, ధైర్యంగా ఎదుర్కొంటాం తప్ప, భయపడం.

👉 రాజకీయంగా పోరాడలేక మాపై అక్రమ కేసులకు పాల్పడుతున్నారు.

👉 వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరం భయపడకుండా ఎదుర్కొంటాం.

👉 రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుంది.

👉 కేసులు, అరెస్టులు, దాడులు, విధ్వంసపాలనతో రాష్ట్రం అట్టుడుకుతుంది.

👉 ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి బలమైన ఎదురుగాలులు వీస్తున్నాయి.

👉 జగన్మోహన్ రెడ్డి గారి పాలన తిరిగి రావాలని ప్రజలు కోరుకుంటున్నారు.

👉 ఆంధ్ర రాష్ట్రంలో జగనన్న 2.O పాలనలో కష్టపడిన నాయకులు, కార్యకర్తలను గుర్తిస్తాము.

👉 జగనన్న 2.O పాలనలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను హింసించిన వారిని ఎవ్వరిని విడిచిపెట్టం.

👉 అధికారం ఉందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ఇబ్బంది పెడితే, ఇబ్బంది పెట్టిన వారిని వంద రెట్లు అధికంగా ఇబ్బందుల పాలు చేయడం ఖాయం.

👉 జిల్లాలో పండించిన ధాన్యాన్నికి గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడుతున్నారు.

👉 సోమిరెడ్డి దళారులతో అంటకాగుతూ, రైతులకు గిట్టుబాటు ధర కల్పించకుండా, ద్రోహం చేస్తున్నాడు.

👉 సోమిరెడ్డి పాపాలన్ని నమోదు చేస్తున్నాం, వడ్డీతో సహా సోమిరెడ్డికి తిరిగి చెల్లించడం ఖాయం..

👉 సోమిరెడ్డితో సహా, రైతుల శ్రమను దోచుకుంటున్న దళారులను ఎవ్వరినీ విడిచిపెట్టం.

👉 గ్రామాల వారిగా బాధ్యతలు నిర్వర్తించగలమన్న వారికి పార్టీ పదవులు అప్పగిస్తాం.

👉 గ్రామాలలో ఎటువంటి సమస్య వచ్చినా, సత్వరమే స్పందించి అండగా నిలుస్తాం.

👉 గ్రామాలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రజలతో మమేకమై, అధికారం లేకపోయినా, ప్రజల అవసరాలను గుర్తించి, ఆదుకునేందుకు ప్రయత్నించండి.

👉 అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజలకు మేలు చేయడమే లక్ష్యంగా పని చేద్దాం.

👉 కూటమి ప్రభుత్వ పాలనలో అవినీతి, అక్రమాలు తప్ప, అభివృద్ధి జాడ కనిపించడం లేదు.

👉 ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ, ఎప్పుడు ఏ అవసరం వచ్చినా, తక్షణమే స్పందించేందుకు సిద్ధం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *