
*ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకు పైకి ప్రత్యక్షంగా ఎక్కి తాగునీటి సరఫరా విధానం, ట్యాంకు లోపల నీటి స్వచ్ఛతను పరిశీలించిన కమిషనర్*
నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ పారిశుధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా స్థానిక 14వ డివిజన్ వేప దరువు ప్రాంతంలో సోమవారం పర్యటించారు.
స్థానిక ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకును కమిషనర్ ప్రత్యక్షంగా ఎక్కి తాగునీటి సరఫరా విధానం, ట్యాంకు లోపల నీటి స్వచ్ఛతను పరిశీలించారు.
ట్యాంకును పరిశుభ్రం చేసే వేళల రిజిస్టర్ ను తనిఖీ చేసి వివరాలను క్రమం తప్పకుండా నమోదు చేయాలని సిబ్బందిని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కర్తం ప్రతాపరెడ్డి, నెల్లూరు నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం అధికారులు, వార్డు సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.