*ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత, అక్షర శిఖరం చెరుకూరి రామోజీరావు మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర యాదవ్..*
తెలుగు ప్రజల భావోద్వేగం రామోజీరావు..
తెలుగువారితో రామోజీ రావు ది విడదీయలేని అనుబంధం. జర్నలిజం రంగం లో ఆయన లేని లోటు పూడ్చలేనిది.
బుల్లి తెర, సినీ రంగం, పర్యాటకం, ఆతిథ్యం, జర్నలిజం ఇలా ఎంచుకున్న రంగం ఏదైనా రామోజీ రావు తనదైన ముద్ర వేశారు.
క్రమశిక్షణ, పట్టుదల, శ్రమించేతత్వం రామోజీరావు ఆభరణాలు. ఆయన జీవితం నేటి తరానికి ఆదర్శనీయం, ఆచరణీయం.
రామోజీరావు స్నేహశీలి, అజాత శత్రువు. తనకు తానే పోటీ, ఆయనకు ఆయనే సాటి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే వ్యక్తిత్వం ఆయన సొంతం.
రామోజీరావు మనల్ని వీడారన్న వార్త బాధిస్తోంది. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను.