ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి.. సి.ఐ.టి.యు పిలుపు
——————————-
ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపుమేరకు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా జరిగే పిలుపులో భాగంగా శుక్రవారం రోజు తిరుపతి జిల్లా గూడూరు పట్టణ మున్సిపల్ కార్మిక సంఘం కార్యదర్శి ధారా కోటేశ్వరరావు ఆధ్వర్యంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించడం జరిగింది. నాయకులు మాట్లాడుతూ సాధారణంగా మరణించిన లేదా ప్రమాదంలో మరణించిన మున్సిపల్ కార్మికులకి ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని, మున్సిపల్ కార్మికులు మరణించిన వారి కుటుంబంలో ఒకరికి కచ్చితంగా పని కల్పించాలని, ఎన్.ఎం.ఆర్ ఇంజనీరింగ్ కార్మికులకు, క్లాప్ డ్రైవర్లకు, బదిలీ కార్మికులకి జీ.వో.ఎం.ఎస్. జీవో. 36 ని వర్తింపజేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని, రక్షణ పరికరాలు ఇవ్వాలని, వాహనాలు మరమ్మతులు, సిబ్బంది సెలవు, పెంపు వంటి డిమాండ్లపై అధికారులకు ఎన్ని దపాలు విన్నవించి నా తాచారం చేయడంతో, ఈరోజు హామీలు అమలు కోసం ధర్నా చేయడం జరిగిందని, పై డిమాండ్లు అమలు కి నోచుకోని పక్షంలో రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఆయా మున్సిపల్ కార్యాలయంలో వద్ద జనవరి 10వ తేదీన దీక్ష ల్లో కూర్చోవడం జరుగుతుందని, కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉప కార్యదర్శి సి.హెచ్.రాజేష్, ఉపాధ్యక్షులు ఏ.పెంచల ప్రసాద్, జిల్లా కమిటీ సభ్యులు ఎన్. వెంకట రమణయ్య, సంపూర్ణమ్మ, మణమ్మ, పట్టణ గౌరవాధ్యక్షులు జోగి శివకుమార్, సి.ఐ.టి.యు. నాయకులు పి.శ్రీనివాసులు, బి.వి రమణయ్య, ఎస్.సురేష్, ఏ. ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed