నెల్లూరు, డిశంబర్ 1 :

*ఇచ్చిన మాటకు కట్టుబడి, పేద ప్రజల సంక్షేమమే పరమావధిగా పనిచేస్తున్న ప్రభుత్వం తమదని అన్న రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ.*

పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా సోమవారం నగరంలోని 11 వ డివిజన్ ఎన్టీఆర్ నగర్ లో పర్యటించిన మంత్రి నారాయణ జోరువానలో సైతం ఇంటింటిటికీ వెళ్లి పెన్షన్ ను అందజేశారు.

తుఫాను ప్రభావంతో ముసురు పట్టి కుండపోత వానలు కురుస్తున్న వేళ ఉదయాన్నే పెన్షన్ల పంపిణీ కు తమ ఇంటికి వచ్చిన మంత్రి నారాయణను చూసి స్థానిక ప్రజలు ఆశ్చర్యచకితులయ్యారు. జయజయ ధ్వానాలతో తమ కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్బంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ ప్రజలకిచ్చిన హామీలను వందశాతం అమలు చేయడమే కాకుండా చెప్పని పనులను సైతం పేదల సంక్షేమం కోసం అమలు చేస్తున్నామన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా పరిపాలన సాగిస్తున్నామన్నారు.

ఆర్థిక పరిస్థితి సహకరించనప్పటికీ ముఖ్యమంత్రికి గల అపార అనుభవంతో కేవలం పెన్షన్స్ కోసమే ఇప్పటివరకు 50 వేల కోట్ల రూపాయల నిధులు వెచ్చించామన్నారు. ప్రతినెలా ఒకటో తేదీన ఠంచను గా రాష్ట్రవ్యాప్తంగా 68 లక్షల మందికి నిరాటంకంగా పెన్షన్ అందజేస్తున్నామన్నారు.

అదేవిధంగా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు తో పాటు ఉచిత బస్సు ప్రయాణం వంటి అన్ని పధకాలను అమలు చేస్తున్నామన్నారు. త్వరలో మరో వంద అన్న క్యాంటిన్లు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, మున్సిపల్ కమిషనర్ నందన్, ఇతర అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed