*ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ద్వారా ప్రతిభా పురస్కారాన్ని అందుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ ను కార్యాలయ అన్ని విభాగాల ఉన్నతాధికారులు ప్రత్యేకంగా సన్మానించారు.*

ఇటీవల రాష్ట్రానికి పెను విపత్తుగా మారిన మొంథా తుఫాను సహాయక చర్యల్లో అత్యంత ప్రతిభాపాటవాలు ప్రదర్శించినందుకు గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ద్వారా ప్రతిభా పురస్కారాన్ని అందుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ ను కార్యాలయ అన్ని విభాగాల ఉన్నతాధికారులు ప్రత్యేకంగా సన్మానించారు.

కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో సోమవారం జరిగిన ఈ ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో కమిషనర్ మాట్లాడుతూ తుఫాను సమయంలో నెల్లూరు నగర పాలక సంస్థ అన్ని విభాగాల అధికారులు, వార్డు సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది సమన్వయంతో విశేషంగా కృషి చేశారని కొనియాడారు.

వరద ముంపు ప్రాంతాలలో యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకొని ప్రాణ, ఆస్తి నష్టం చేకూరకుండా నిరంతరం పర్యవేక్షించడంలో ప్రతి ఒక్క ఉద్యోగి పాత్ర అత్యంత అభినందనీయమని కమిషనర్ కొనియాడారు.

తుఫాను సమయంలో ప్రజా జీవనానికి ఆటంకం కలగకుండా నెల్లూరు నగరపాలక సంస్థ ప్రణాళికాబద్ధంగా చేపట్టిన చర్యలకు గాను “సైక్లోన్ మొంథా ఫైటర్” అవార్డును ముఖ్యమంత్రి ద్వారా అందుకోవడం గర్వంగా ఉందని కమిషనర్ వెల్లడించారు.

కమిషనర్ను అభినందించిన వారిలో నెల్లూరు నగరపాలక సంస్థ అన్ని విభాగాల ఉన్నతాధికారులు, సిబ్బంది ఉన్నారు.

పి.ఆర్.ఓ.
నెల్లూరు నగరపాలక సంస్థ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *