*అహర్నిశలు విధుల నిర్వహణలో కమిషనర్ చూపుతున్న కృషి అత్యంత అభినందనీయమని వారు ప్రశంసించిన లైసెన్స్ డ్ టెక్నికల్ పర్సన్స్ అసోసియేషన్ నాయకులు*

 

నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ ద్విత్వ తుఫాను నేపథ్యంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నగరవ్యాప్తంగా రోడ్లపై వరద నీరు చేరకుండా డ్రైన్ కాలువల పారిశుధ్య నిర్వహణ పనులను ప్రణాళికాబద్ధంగా నిర్వహించి, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చేపట్టిన చర్యలను అభినందిస్తూ ఎల్టిపి అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం కమిషనర్ ను ఘనంగా సన్మానించారు.

కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలోని కమిషనర్ చాంబర్లో జరిగిన ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు మాట్లాడారు.

అహర్నిశలు విధుల నిర్వహణలో కమిషనర్ చూపుతున్న కృషి అత్యంత అభినందనీయమని వారు ప్రశంసించారు.

మున్సిపల్ శాఖ మంత్రివర్యులు పి. నారాయణ, రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిల నేతృత్వంలో నెల్లూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని కొనియాడారు.

ఎల్.ఆర్.ఎస్, బి.పి.ఎస్ పథకాలపై ప్రజలందరికీ చక్కటి అవగాహన కల్పిస్తూ, పథకాన్ని సద్వినియోగం చేసుకునేలా కమిషనర్ అమలు చేస్తున్న విధానాలు అత్యంత ప్రశంసనీయమని అసోసియేషన్ నాయకులు ప్రశంసించారు.

ఈ కార్యక్రమంలో లైసెన్స్ డ్ టెక్నికల్ పర్సన్స్ అసోసియేషన్ నాయకులుl పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *